తెలుగుదేశం పార్టీలో ఆమె పాచికలు పారలేదు. వెంటనే ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు.. బీసీ మహిళ కావడంతో వైసీపీ కండువా కప్పుకుని చిలకలూరిపేట నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్న.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ను పక్కకు నెట్టేసి వైసీపీ సీటు సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. అనంతరం మూడు ఏళ్లకు జగన్ క్యాబినెట్లో ఏకంగా మంత్రి అయిపోయారు. జగన్ క్యాబినెట్లో రజనీ మంత్రి అయ్యాక ఆమె ఆడింది ఆట.. పాడింది పాట.. అన్నట్టుగా మారింది. అసలు వైసీపీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలకు కూడా కాని పనులు అన్ని రజనీకి అయిపోయేవి.
రజిని వైసీపీలో ఒక రేంజ్ లో హవా చలాయించారు. చాలామంది కీలక నేతలకు కానీ పనులు కూడా ఆమెకు అయిపోయేవి. పార్టీలోనూ మహామహులకు లేని ప్రాధాన్యత.. రజనీకి దక్కేది. అలాంటి రజని గత ఎన్నికలలో చిలకలూరిపేటలో ఓడిపోతుందని తెలియడంతో.. జగన్ పట్టుబట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారారు. ఎన్నికల్లో రజని ఏకంగా 53,000 ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అయితే ఇప్పుడు చిలకలూరిపేట సీటును జగన్ ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఆయనకు చెప్పారు. వెంటనే రజని మ్యూజిక్ మొదలుపెట్టేసింది. జగన్ ను కలిసి ఏ మాయ చేసిందో.. ఏ మ్యాజిక్ చేసిందో.. కానీ వెంటనే మర్రి రాజశేఖర్ పేరు సైడ్ అయిపోయింది. చిలకలూరిపేట ఇన్చార్జిగా విడుదల రజని నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసేసారు. అలా పార్టీలో రజనీ రింగ్ మ్యాజిక్ ఒక రేంజ్ లో నడుస్తుందన్న గుసగుసలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.