బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా రేవంత్ రెడ్డి గురించి విమర్శలు చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ తిరగబడుతోందని తెలంగాణ తల్లడిల్లుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. కుటుంబ దాహం కొరకు తన ప్రాంతం గురించి కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుందని మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుందని ఆయన కామెంట్లు చేశారు.
పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ రాష్ట్రం గరం అయిపోతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా అసంతృప్తులు కొనసాగుతున్నాయని ఆయన కామెంట్లు చేశారు. ధాన్యం కొనుగోలు కోసం, మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కారని కేటీఆర్ తెలిపారు.
హైడ్రా దౌర్జన్యాల విషయంలో జనం తిరుగుబాటు చేస్తున్నారని కేటీఆర్ కామెంట్లు చేశారు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అన్నదాతలు కన్నెర్ర జేస్తున్నారని కుల గణన ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారని కేటీఆర్ కామెంట్లు చేశారు. అమృత్ టెండర్ల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలని అక్రమాలు నిజమే అని ప్రూవ్ అయితే టెండర్లను రద్దు చేసి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కేటీఆర్ చేసిన విమర్శల గురించి కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రేవంత్ సర్కార్ కు షాకిచ్చే దిశగా కేటీఆర్ తెలివిగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కేటీఆర్ భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.