దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఎన్ని శిక్షలు విధించినప్పటికీ మహిళల పైన, చిన్నారుల పైన ఎక్కడో ఒక చోట అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలే తెలియజేస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది దుర్మార్గులుగా మారుతూ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల పైన ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఆగడం లేదు.


ఇప్పుడు తాజాగా నంద్యాల జిల్లాలోని కులుములపల్లి గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకున్నదట. ఏడేళ్ల చిన్నారి పైన ఒక దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే బయట ఆడుకుంటున్నటువంటి చిన్నారి పై.. ఎల్లమ్మ అనే వ్యక్తి ఈ ఆగాయిత్యానికి  పాల్పడినట్లుగా సమాచారం.ఈ చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి కూడా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి నిందితుడనీ పట్టుకుందామనుకునే లోపు అక్కడి నుంచి పరారయ్యారట.


వెంటనే అక్కడ స్థానికులు సైతం ఆ చిన్నారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడు పైన ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరి ఈ విషయం మీద అటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. ఇప్పటికే కూటం ప్రభుత్వం పైన వైసిపి నేతలతో పాటు ప్రజలు కూడా ఈ అత్యాచారాల సంఘటనల పైన విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల పైన జరుగుతున్న విషయాలపైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇటీవలే ఇలాంటి వారిని నడిరోడ్లు శిక్షించాలి అంటూ తెలియజేయడమే కాకుండా ఇలాంటివి ఎవరు చేసినా కూడా సహించము అంటూ తెలిపారు. మరి ఇప్పుడు జరిగిన ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: