ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి నేతలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న పోస్టు సోషల్ మీడియాలో పెడితే.. నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేస్తున్నారు. అంతేకాదు 2015 నుంచి టిడిపికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను.. గుర్తించి పెట్టిన వారిపై కేసులు పెడుతున్నారు ఏపీ పోలీసులు. ఎక్కడ దాక్కున్న అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏపీలో స్వేచ్ఛగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి ఎక్కడ లేదు.

 
వైసిపి నేతలను హింసించి మరి.. నరకం చూపిస్తున్నారు తెలుగుదేశం కూటమినేతలు. అయితే దీనిపై తాజాగా  ఏపీ మాజీ మంత్రి  పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతలను.. టార్చర్ చేస్తున్న ఏపీ పోలీసులు అరబ్ కంట్రీలలో ఉంటే... వాళ్లకు ఉరి వేసే వారని  సంచలన వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. దుబాయ్ లాంటి కంట్రీలలో.. నేతలను వేధిస్తే పోలీసులకు అలాంటి కఠిన చర్యలు విధిస్తారని కూడా గుర్తు చేశారు.

 
మొన్నటికి మొన్న తుళ్లూరు డిఎస్పి  మురళీకృష్ణ...  తన షూలు విప్పి... మరిచిపోయారని మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పచ్చి బూతులు  మాట్లాడి.. టిడిపి కార్యకర్తగా మారిపోయారని కూడా ఆగ్రహించారు. ఇలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని... మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా ఎన్ని రోజులు.. చేస్తారని నిప్పులు చెరిగారు.

 
వైసిపి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు పులి మీద స్వారీ చేస్తున్నారని... ఆ పులి కూడా మిమ్మల్ని తినే టైం వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. చాలామంది వైసిపి పార్టీ సోషల్ మీడియా వారియర్లను.. అక్రమంగా అరెస్టు చేశారని... అలాంటి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. లేకపోతే వారి కోసం ప్రత్యేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: