దీనికి కూటమి పార్టీలు కూడా ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. దీంతో కూటమి నుంచి మరెవరు కూడా నామినేషన్ వేసే అవకాశాలు లేవు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఎన్నికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా మంత్రి పదవి రఘురామకృష్ణ రాజుకు ఇస్తారని అందరు అనుకున్నారు. కానీ మంత్రి పదవి ఆయనకు దక్కలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కూడా వస్తుందని అందరూ ఊహించారు.
అక్కడ కూడా రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురయింది. నామినేటెడ్ పోస్టర్లో కచ్చితంగా ఆయనకు పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురు కావడంతో తాజాగా చంద్రబాబు నాయుడు ఆయనకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణ రాజును ఫైనల్ చేశారు. కాగా ఎన్నికల కంటే ముందే వైసిపి పార్టీకి రాజీనామా చేశారు రఘు రా మకృ ష్ణ రాజు. అనంతరం ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా... ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు.