మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించబోతోందా  ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  పవన్ కల్యాణ్‌కు ప్రచార బాధ్యతలు అప్పగింనట్లు ప్రచారం జరుగుతోంది.అంతేకాదు ముంబై, థానే తో పాటు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం.మరోవైపు పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ ది కూడా మహారాష్ట్ర కావడం విశేషం.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ప్రయాణం సాగుతోంది.టీడీపీతో బీజేపీ జట్టుకట్టి.. మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి పవన్ కళ్యాణ్ ఎంతగా కృషిచేశారో అందరికీ తెలిసిన సంగతే. అయితే టీడీపీతో, సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే.. పవన్ కళ్యాణ్కు, బీజేపీకి సిద్ధాంతపరంగా కొన్ని సారూప్యతలు ఉన్నాయి. దీంతో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్కు అదే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ను దించుతోంది బీజేపీ. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ను కోరింది. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.

ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16,17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.ముఖ్యంగా మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఛరిష్మాను ఉపయోగించుకుని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. మొన్నామధ్య జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరుఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: