ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీకి రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది వైసిపి. ఒక వైపు కూటమి కేసులు, మరోవైపు నేతల పార్టీ మార్పు, ఇలా వరుసగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అటు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు... వైయస్ షర్మిల ఆశల కోసం పోరాటం చేస్తూ... జగన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది.


వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన అనిల్ కుమార్ యాదవ్... తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ సన్యాసం తీసుకునేందుకు ఆయన రెడీ అయ్యారట. దీనికి కారణం ఈ మధ్యకాలంలో... ఇక్కడ కూడా ప్రజల్లో కనిపించలేదు అనిల్ కుమార్ యాదవ్. ప్రజలను పట్టించుకునే.. పరిస్థితి కనిపించడం లేదు.


దీంతో ఆయన రాజకీయాల నుంచి దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్.  ఈ రెండుసార్లు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే... మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెట్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్కు ఇవ్వలేదు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపి టికెట్ ఇవ్వడం జరిగింది.


దీంతో ఆయన ఓడిపోయారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్. భారీ నీటిపారుదల శాఖను.. అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే.. ఇప్పుడు వైసీపీ పార్టీ... చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం దూరంగా ఉంటున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోజనలో  ఉన్నారట.మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: