ప్రముఖ సినీ నటి, వైసీపీ మజీ ఎమ్మెల్యే రోజా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారనే సంగతి తెలిసిందే. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒకింత దూకుడుతో వ్యవహరించిన రోజా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సినీ, రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే రోజాను చాలా సందర్భాల్లో టార్గెట్ చేసిన కిర్రాక్ ఆర్పీ తాజాగా మరోసారి టార్గెట్ చేయడం గమనార్హం.
 
గతంలో అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ రోజా చేసిన ఫిర్యాదు గురించి ఆర్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసం అన్నయ్య తనను వేధిస్తున్నాడని డబ్బులు ఇవ్వని పక్షంలో నా గురించి తప్పుగా ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడని సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బంతా తీసుకుని నన్ను నడిరోడ్డుపై ఉంచాడని చంపుతానని వార్నింగ్ లు ఇస్తున్నాడని 2013 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీన రోజా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
 
అయితే ఆర్పీ ఆరోపణలు నిజమా కాదా అని చెక్ చేస్తే మాత్రం ఆ ఆరోపణలు నిజమేనని వెల్లడవుతోంది. జబర్దస్త్ లో కలిసి అని చేసినంత మాత్రాన రోజాను ప్రశ్నించకుండా ఉండాలా అని అన్నారు. ఆర్పీ చేసిన ఆరోపణల గురించి రియాక్ట్ కావడానికి రోజా మాత్రం ఆసక్తి చూపడం లేదు. కిర్రాక్ ఆర్పీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. రోజాకు మాత్రం ఆర్పీ చుక్కలు చూపిస్తున్నాడు.
 
మరోవైపు రోజాకు వైసీపీలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదు. రోజా సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ఆమెకు అవకాశాలు అయితే రావడం లేదు. రోజా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రోజా భవిష్యత్తులో కెరీర్ పరంగా ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.  మాజీ ఎమ్మెల్యే  రోజా అధికారంలో ఉన్న చేసిన తప్పుల గురించి కొంతమంది విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: