VIDUDALA RA
ఇదిలా ఉంటే వైసీపీలో మరో రెండు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికలకు ముందు వరకు గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎన్నికల్లో ఆమెను తాడికొండకు మార్చారు.. విజయవాడకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ ను ప్రతిపాడులో పోటీ చేయించుగా ఆయన ఓడిపోయారు. తాజా సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ ను తప్పించి ప్రతిపాడుకు కొత్త ఇన్చార్జి నియమిస్తారని తెలుస్తోంది. సుచరిత రాజకీయాల్లో కొనసాగేందుకు ఆసక్తి చూపించటం లేదు. దీంతో ఆమె భర్త దయాసాగర్‌కు అవకాశం ఇస్తారా లేదా మరో వ్యక్తికి అక్కడ అవకాశం ఇస్తారా ? అన్నది చూడాలి.
ఇక ఏలూరు జిల్లాలోని పోలవరం ఎస్టి రిజర్వాడ స్థానం నుంచి గత ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. బాలరాజుకు సీటు ఇచ్చేందుకు స్థానిక వైసీపీ నేతలు ఒప్పుకోలేదు. దీంతో ఆయనకు బదులుగా బలరాసు భార్య రాజ్యలక్ష్మి కి సీటు ఇవ్వగా ఆమె జనసేన నుంచి పోటీ చేసిన చిర్రి బాలరాజు చేతిలో ఓడిపోయారు. ఇక తాజాగా మార్పులు చేర్పుల నేపథ్యంలో రాజ్యలక్ష్మిని తప్పించి అక్కడ పార్టీ పగ్గాలు తిరిగి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకే అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.
అలాగే గత ఎన్నికలలో ఏలూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను తిరిగి తప్పించి సునీల్ ను మనోడి సొంత నియోజకవర్గం తణుకు అసెంబ్లీకి పంపుతారని ... తణుకులో సునీల్ కుమార్ తండ్రి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బదులుగా సునీల్ కుమార్‌ను ఇన్చార్జిగా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మార్పులు చేర్పులపై త్వరలోనే క్లారిటీ రానుంది.