రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారంను చాలామంది పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. బంగారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చని చాలామంది ఫీలవుతారు. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో పసిడిని కొనుగోలు చేయడం ఎలా అని చాలామంది టెన్షన్ పడ్డారు.
 
అయితే ఆ టెన్షన్ ను తగ్గించే విధంగా బంగారం ధరలు ఈ మధ్య కాలంలో తగ్గుతున్నాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలలో బంగారం ధరలు 70450 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 76850 రూపాయలుగా ఉంది. అయితే బంగారం ధరలు పతనమైనా వెండి ధరలు మాత్రం భగ్గుమనడం గమనార్హం. హైదరాబాద్ లో కేజీ వెండిపై 1000 రూపాయల వరకు పెరగడంతో వెండి ధర లక్షా 1000 రూపాయలకు పెరిగింది.
 
అయితే అమెరికాలో ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం వల్లే బంగారం ధరలు పెరిగాయని తెలుస్తోంది. బంగారం ధరలు భగ్గుమనడంతో పసిడి కొనుగోలుకు దూరంగా ఉన్నవాళ్లు ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
 
భవిష్యత్తులో బంగారం కచ్చితంగా కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ప్రస్తుతం బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తే మంచిదని చెప్పవచ్చు. బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే బంగారం కొనుగోలు చేస్తే ఈ ధరలకు కొనుగోలు చేసినా జీఎస్టీ, ఇతర పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. బంగారం కొనుగోలుదారులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో కేజీ బంగారం ధర కోటి రూపాయలకు చేరుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం ఎప్పటికి నిజమవుతుందో చూడాల్సి ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: