తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుం ది. ఇదిలా ఉండగా... గత వైసిపి ప్రభుత్వ హయాంలో వైసిపి వీరాభిమాని అయినా శ్రీ రెడ్డి చెలరేగిపోయి లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాగబాబు వంటి ప్రముఖులపై నోటికి వచ్చినట్టుగా బూతులు మాట్లాడేది. అయితే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ వంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ తరుణంలోనే శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. తన వల్ల వైసీపీ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, మాజీ సీఎం జగన్ ను క్షమించాలంటూ నటి శ్రీరెడ్డి కోరుతున్నారు. ప్రత్యర్థులపై తాను వాడిన భాషతో పార్టీకి చాలా నష్టం వాటిల్లిందని, ఇకపై వైసీపీకి దూరంగా ఉంటానంటూ లేఖ రాసింది.
మరొకవైపు తన కుటుంబాన్ని కాపాడాలంటూ మంత్రి లోకేష్ ను కోరింది. కూటమి పార్టీలు, నేతలపై జుగుప్సాకరంగా మాటలు మాట్లాడి తప్పు చేశానని శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. ఇక శ్రీరెడ్డిపై రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ టాపిక్ సెన్సేషనల్ అవుతుంది. ఇక అటు పోసాని కృష్ణ మురళిపై కూడా కేసులు అవుతున్నాయి.