తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కొడంగల్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ పై కొడంగల్ రైతులు దాడి చేయడమే. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ఈ దాడిలో పాల్గొన్న రైతులు అలాగే గులాబీ పార్టీ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. కలెక్టర్ పై దాడి వెనుక గులాబీ పార్టీ నేతలు ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు వచ్చాయి.

 

దీని అంతటికి కారణం  పట్నం మహేందర్ రెడ్డి అని అంటున్నారు. కొడంగల్ నియోజకవర్గం లో... రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నాడు పట్నం మహేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఉంటే.. అతడికి దీటుగా పట్నం మహేందర్ రెడ్డి పని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన 2018 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు పట్నం మహేందర్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. తృటిలో రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు పట్నం మహేందర్ రెడ్డి.

 కేవలం 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.  ఓడిపోయినప్పటికీ కొడంగల్ నియోజకవర్గంలోనే ఉంటూ అక్కడి ప్రజల కోసం పనిచేస్తున్నారు పట్నం మహేందర్ రెడ్డి.  నిత్యం జనాలతో ఉంటూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా   కొడంగల్ లోని  ఫార్మసిటీ రైతుల కోసం కూడా పోరాటం చేస్తున్నారు పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్  కలెక్టర్ పై దాడి చేసింది  పట్నం మహేందర్ రెడ్డి అనుచరులే అని అంటున్నారు. అందుకే అతనిని అరెస్టు కూడా చేశారు.

 అయితే రైతుల కోసం పట్నం మహేందర్ రెడ్డి అరెస్టు కావడంతో ఆయన.. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో హీరోగా మారిపోయాడు. రేవంత్ రెడ్డి ని కొట్టగల మొనగాడిలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన రేవంత్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించే సత్తా అతనిలో వచ్చింది అని రైతులు చర్చించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ నాయకుడైన అరెస్టు అయితే వెంటనే అతడు పవర్ఫుల్ లీడర్ గా మారిపోతున్నారు. ఏపీలో చంద్రబాబు అలాగే అరెస్టయి ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ని కూడా రేవంత్ రెడ్డి హీరో చేసినట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: