ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్కు సైతం 25% రాయితీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఏపీ ఆర్టీసీ బస్సులోనైనా సరే వీటిని ఉపయోగించుకొని ప్రయాణించే వీలు కల్పిస్తున్నామంటూ తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఈ రాయితీ అమలు ఉంటుందని ఇందుకోసం ఆరు రకాల గుర్తింపు కార్డులను కూడా తీసుకువచ్చామంటూ కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇందులో ఒకటి ఆధార్ కార్డు కాక మరొకటి సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, అలాగే ఓటర్ కార్డు, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఇలా వాటిలో ఏదో ఒకటి చూపించి రాయితీని పొందవచ్చట.
అలాగే ఫిజికల్ గా లేదా డిజిటల్ రూపంలో చూపించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలియజేసింది.. సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన ఎటువంటి ప్రూఫ్లనైనా ఏ విధంగా అయినా చూపించవచ్చని తెలిపారు ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపోలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామంటూ తెలియజేశారు రవాణా శాఖ అధికారులు. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ కూడా వీటిని ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. ఎంత దూరం ప్రయాణించిన 25% వరకు రాయితీ కలిగి ఉంటుందని వెల్లడించారు. మరి ఏ మేరకు ఇది కూటమి ప్రభుత్వానికి కలిసొస్తుందో చూడాలి మరి. ముఖ్యంగా ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం మీద ప్రజలు కోపంగా ఉన్నారు.. మరి రాబోయే రోజుల్లోనైనా అమలు చేస్తారేమో చూడాలి.