ఐదుసార్లు ఎమ్మెల్యే... అంటే 21 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఏకచక్రాధిపత్యం. అయినప్పటికీ ఇప్పుడు సాధారణ పౌరుడి లాగా... క్యూ లైన్ లో నిల్చున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనను చూసి అందరూ నేర్చుకోవాలని... మార్గ నిర్దేశకుడిలా అందరికీ కనిపిస్తున్నాడు. అతనే గుమ్మడి నరసయ్య. గుమ్మడి నరసయ్య గురించి తెలియని వారు ఉండరు. కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి... ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గ్రాండ్ విక్టరీ కొట్టాడు గుమ్మడి నరసయ్య.

సర్పంచ్ అయితేనే ఇప్పుడు జనాలు ఆగడం లేదు. కార్లు అలాగే... పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకొని లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ గుమ్మడి నరసయ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా..  సాధారణ పౌరుడిగానే తన జీవితాన్ని గడుపుతున్నారు.  ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే అయిదు సార్లు విజయం సాధించారు గుమ్మడి నరసయ్య. 1983, 1985,  1989, 1999 అలాగే 2004 ఇలా ఐదుసార్లు ఇల్లందు నియోజకవర్గంలో నుంచి విజయం సాధించి చరిత్ర సృష్టించారు గుమ్మడి నరసయ్య.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎప్పుడు కూడా ఆయన కారు  లో అసెంబ్లీకి వెళ్లలేదు. ఆర్టీసీ బస్సులోనే అసెంబ్లీకి వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో గళం విప్పేవారు. అయితే అలాంటి.. గుమ్మడి నరసయ్య ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచిన కూడా...  ఇప్పటికీ సాధారణ పౌరుడు గానే జీవితాన్ని నడుపుతున్నారు.  ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్ వాడడం, లేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ఆయనకు అలవాటుగా మారింది.

ఈ తరుణంలోనే తాజాగా కంటి పరీక్షలకు వెళ్లిన ఆయన... క్యూ లైన్ లో కంటి పరీక్షలకు నిలబడ్డారు. పాల్వంచలోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో... జనాలు విపరీతంగా ఉన్నారు. దీంతో అందరిలాగా... ఓపి చీటీ రాయించుకొని.. క్యూ లైన్ లో సామాన్య ప్రజల మధ్య నిలబడ్డాడు. తన లైన్ వచ్చేవరకు  వెయిట్ చేసి కంటి పరీక్షలు చేసుకున్నాడు గుమ్మడి నరసయ్య. ఇప్పుడు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఇలాంటి వాళ్లు ఎమ్మెల్యే అవుతే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: