ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల నాయకుడు అయిన ఆయన రాజకీయంగా మాత్రం రకరకాల రాంగ్ స్టెప్పులు వేసి తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత పరిపాలన .. విధానాలు నిర్ణయాలలో చాలా రాంగ్ స్టెప్పులు వేశారు. అందులో ఆరు కృష్ణయ్యకు రాజ్యసభ పదవి కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులు లేనట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గాల్లో ప్రముఖ నాయకులకు గతి లేనట్టుగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఆరు కృష్ణయ్యను తీసుకువచ్చి ఏపీ నుంచి తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపారు. ఆ సందర్భంలో అవసరం కొద్దీ జగన్ కీర్తించిన కృష్ణయ్య ఇప్పుడు తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్లాన్ తో ఉన్నారా ? అంటే అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి.


వాస్తవానికి కృష్ణయ్య ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడు 2014 ఎన్నికలలో ఆ పార్టీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలలో తెలంగాణ తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారంలోకి వచ్చారు. అనంతరం కృష్ణయ్య 2018 ఎన్నికల నాటికి కాంగ్రెసులోకి వెళ్లి మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొంతకాలం బిజెపికి దగ్గరయ్యారు. ఆ తర్వాత వైసిపి కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. మరో మూడు సంవత్సరాలు పాటు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఉంది. సార్వత్రిక ఎన్నికలలో వైసిపి ఓడిపోయిందో లేదో వెంటనే వైసీపీ ప్రాథమిక సభ్యత్వం తో పాటు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.


వైసీపీ నుంచి బయటకు వచ్చిన కృష్ణయ్య బిజెపిలో అవకాశం ఉందని ప్రచారం జరిగింది .. ఇప్పుడు బిజెపి కూడా పోయింది.. మళ్లీ ఆయన తెలుగుదేశం లో చేరతారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కి అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్య ఆ సంఘం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావు నియమించారు. ఆయన తెలుగుదేశం అనుకూలుడిగా పేరు ఉంది. నాగేశ్వరరావు తెలుగుదేశం నాయకులు టిడి జనార్ధన్ - బీద రవిచంద్ర - నూక‌సాని బాలాజీ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ నియామకం ద్వారా కృష్ణయ్య మళ్ళీ తెలుగుదేశంలో చేరతారా లేదా వారి ద్వారా జాతీయ రాజకీయాల్లో బిజెపి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP