ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు అయిన ముద్రగడ పద్మనాభరెడ్డి ఇప్పుడు మరొకసారి లేఖలు రాయడం మొదలుపెట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ అమలు చేయలేక చేతులు ఎత్తడం మీకు తగునా అంటూ ప్రశ్నించడం జరిగింది.. ముఖ్యంగా సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అంటూ ఎద్దేవా చేసినట్లు ప్రశ్నించారు ముద్రగడ. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణాన్ని అడ్డుకోకపోవడం చాలా అన్యాయమని తెలిపారు



ఈ రోజున సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ వైసిపి నేత ముద్రగడ లేఖను రాస్తూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదని అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వంటి వాటిపైన దృష్టి పెట్టాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది. దొంగ సూపర్ సెక్స్ హామీలను సైతం తలుచుకుంటేనే భయమేస్తుంది అన్నారు ప్రజల దృష్టిని మరచడానికి పనిచేస్తున్న వారందరినీ కూడా విమర్శించారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మీకు తగునా అంటూ తెలియజేశారు ముద్రగడ. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక కేవలం రెడ్ బుుక్ వేధింపులతో సోషల్ మీడియా వాళ్లపైన కేసులు పెట్టడం సరైనదేనా అంటూ ఆరోపిస్తున్నారు.


సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న వైసిపి వారందరి పైన పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు సీఎం చంద్రబాబు పైన ఇలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడంతో ఈ అంశం పైన ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలవుతుందని సీరియస్ గా తీసుకొని వారందరిపై ఉక్కు పాదం మోపేలా చూస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇలా లేఖను విడుదల చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి సూపర్ సిక్స్ హామీల సంగతి పై సీఎం చంద్రబాబు ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: