సాదరణంగా సాలె పురుగు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో లేదంటే బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి సాలెపురుగు కనిపించడం చూస్తూ ఉంటాం. అయితే ఇవి చిన్న ఆకారంలో ఉండడంతో.. వీటికి పెద్దగా ఎవరూ భయపడరు కూడా. సాలెపురుగులు ఒక గూడును ఏర్పాటు చేసుకొని ఆ గూడులోకి వచ్చి చిక్కిన పురుగులను ఇతర జీవులను తినేయడం చేస్తూ ఉంటుంది. ఇలా కడుపు నింపుకుంటూ ఉంటుంది. అయితే ఇలా మనుషులు పెద్దగా భయపడని సాలె పురుగులు అత్యంత ప్రమాదకరమైనది అంటూ నిపుణులు చెబుతూ ఉన్నారు. సాలెపురుగులు తలుచుకుంటే కోట్లాదిమంది మనుషులను కూడా తినేయగలవు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఎంతో చిన్న ఆకారంలో కనిపించే సాలెపురుగు నన్నేమి చేస్తుందిలే అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే భూమిపై ఉన్న ఏ జీవిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అంటూ సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే భూమి మీద ఉన్న సాలీడు జాతంతా తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిని ఒక్క ఏడాదిలోనే తినేయగలుగుతాయి అని సైన్స్ ఆఫ్ నేచర్ జర్నల్లో ప్రచురించారు. సాలీడులు ఏడాదికి 400 మిలియన్ టన్నుల ఆహారాన్ని తీసుకుంటాడట. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రజల బయోమాస్ 287 టన్నులు మాత్రమే అని ఇక ఈ జర్నల్లో ప్రచురించారు. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.