గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా యూట్యూబ్లో  మంచి పాపులారిటీ సంపాదించుకున్న మహాసేన రాజేష్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక సామాజిక వర్గం మీదగా బాగా పేరు సంపాదించారు. మొదట మహాసేన రాజేష్ వైసీపీలో చేరిన తర్వాత మళ్లీ ఆ పార్టీలో ఉండలేక బయటకు వచ్చి జనసేన పార్టీలోకి చేరారు. అయితే అక్కడ కూడా కుదరలేక చివరికి టిడిపి పార్టీలోకి చేరారు. రాజమండ్రిలో చంద్రబాబు సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఆయనకు గన్నవరం టికెట్ ను మొదట టిడిపి పార్టీ కేటాయించింది.. అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని వీడియోలు ఆరోపణల వల్ల ఒక వర్గం వారు తమకు ఓట్లు వేయమని హెచ్చరించడంతో టికెట్ ఇవ్వకుండా చేశారు.



చంద్రబాబు కూడా ఈయనకు టికెట్ విషయం పైన పిలిపించి మరి మాట్లాడి నచ్చచప్పి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రత్యేకమైన వాహనాన్ని కూడా కేటాయించారు. కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ కంటే జగనే మేలు అనే విధంగా సోషల్ మీడియాలో చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ఆ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పుడు తాజాగా మహాసేన రాజేష్ పైన ఒక పోలీస్ కేసు నమోదైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


అసలు విషయంలోకి వెళ్తే సోషల్ మీడియాలో మహాసేన రాజేష్ ఆయన అనుచరులు సైతం ఒక మహిళను వేధిస్తున్నారని ఆరోపణలు తెలియజేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట.. కోనసీమ జిల్లాల టిడిపి ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ అతని అనుచరుల పైన శంకరగుప్తం గ్రామానికి చెందిన శాంతి అనే మహిళ ఫిర్యాదు చేసిందట.. తన ఫోటోలను మార్పింగ్ చేసి మరి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రాజేష్ తో పాటు ఆయన అనుచరులు నలుగురు పైన కేసు నమోదైనట్లుగా సమాచారం. మొత్తానికి ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ ఇన్ని నెలలకు మహాసేన రాజేష్ పేరు వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: