ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే వారిని కనీసం భారతదేశ పౌరుడిగా కూడా పరిగణించరు. ఇలా ఆధార్ కార్డుతోనే నేటి రోజుల్లో ఇండియాలో ప్రతి మనిషి జీవితం ముడిపడి ఉంది. ఏం చేయాలన్న కూడా ఈ ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక ఆర్థిక లావాదేవీలకు కూడా ఈ ఆధార్ కార్డు ఎంతో అవసరం అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎంతోమంది ఆధార్ కార్డు తీసుకుని ఉన్నారు. కొంతమంది ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరి కూడా చేసుకుంటున్నారు. ఇక ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆధార్ కార్డు సిస్టం వచ్చాక మొదటి కార్డు పొందిన వ్యక్తి ఎవరు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు పొందాల్సిందే అని కేంద్ర నిబంధన పెట్టింది. అయితే ఇలా అంటే నిబంధన వచ్చిన తర్వాత తొలి ఆధార్ కార్డును ఎవరికి ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రకు చెందిన రచన సోనా వాని అనే మహిళకు మొదటి ఆధార్ కార్డు ఇచ్చారు. దీంతో ఆమె చరిత్రలో తొలి ఆధార్ కార్డు పొందిన వ్యక్తిగా నిలిచిపోయారు. ఇన్నాళ్లు ఈ విషయం గురించే ఆలోచించలేదు అంటూ ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతోమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.