అయితే కేసీఆర్ ఓడిపోయాక ఫామ్ హౌస్ లో పరిమితమయ్యారని విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయి..జగన్ విషయానికి వస్తే తాడేపల్లి టు బెంగళూరు అన్నట్లుగా చేస్తున్నారని విధంగా ప్రచారం అయితే చేస్తున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ఏడాది కావస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీ అధికారం కోల్పోయి ఆరు నెలల వస్తూ ఉన్నది. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ మీ ఇద్దరి నేతలు కూడా ఇప్పుడు ఒక ముహూర్తం చూసుకొని మరి జనాలలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకు కొత్త ఏడాది జనవరి నుంచే ఒక ముహూర్తాన్ని సైతం ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. 2025 సంక్రాంతి నుంచి కెసిఆర్ జనంలోకి రాబోతున్నారని అప్పటినుంచి బిఆర్ఎస్ గేర్ మారుస్తుందనే విధంగా పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఏడాది దాటిన కాంగ్రెస్ పాలన పైన జనాలలో చాలా వ్యతిరేకత కనిపిస్తోందని బిఆర్ఎస్ నేతలు తెలియజేస్తున్నారు. అందుకే చాలామంది బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలియజేస్తున్నారట.
ఇక అదే విధంగా ఆంధ్రాలో విషయానికి వస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా 7 నెలలు కాబోతోంది. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదని విధంగా ప్రజలు పెదవి విరుస్తున్నారట.. ఇదే కాకుండా చాలా పనులను మార్చి మరి చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని జగన్ జనంలోకి వెళ్తే కచ్చితంగా బ్రహ్మరథం పడతారని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారట. జగన్ జనంలోకి వస్తే ప్రజాదరణ రావడం జరుగుతుందని ఎన్నో విషయాలలో నిరూపించారు. వైసీపీ అధినేత జగన్ అందుకే జిల్లాల వారీగా పర్యటనలను సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అటు కేసీఆర్ ,జగన్ ఇద్దరు కూడా అధికార పార్టీల పైన తమదైన శైలిలో దూసుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.