ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల పైన ప్రస్తుతం కసరత్తు చేస్తుందట. అందుకు తగ్గట్టుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస కూడా పలు విషయాలను తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి మూడు నెలల బకాయి అందించడంతో పింఛన్దారులంతా ఆనందంగా ఉన్నారని డిసెంబర్ నుంచి కొత్త పింఛన్లు అమలులోకి తీసుకువస్తామంటూ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పించిని పొందుతున్న వారిలో మూడు లక్షల మంది అనర్హులు ఉన్నారని తెలియజేశారు. కొత్తగా 2 లక్షల మంది అర్హులు పించిని కోసం ఎదురుచూస్తున్నారంటూ తెలియజేశారు.


300000 మంది పై అనార్హత  వేట వేయబోతోంది కూటమి ప్రభుత్వం ఈ విషయం తెలిసి చాలా మంది పింఛనీదారులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ పింఛన్దారున్ని కూడా తీసేయమని చెప్పి ఇప్పుడు కొత్త పింఛన్దారుల కోసం మూడు లక్షల మందిని తొలగిస్తారా అంటూ పెదవి విరిస్తున్నారు. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పవచ్చు. టిడిపి పాలనలోని 2014లో 200గా ఉన్న పింఛనీ డబ్బులను  ఒకేసారి రెండు వేలకు పెంచామని ఇప్పుడు మళ్లీ 4,000 రూపాయలకు పెంచిన ఘనత మాదే అంటూ తెలుపుతున్నారు.


గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 1000 రూపాయలు మాత్రమే పెంచిందని అది కూడా నాలుగు దశలలో పెంచారని తెలియజేశారు. అనర్హులకు పించినిని తొలగిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని భావించామని తెలియజేశారు. కొంతమంది ధృవపత్రాలు సంపాదించి దివ్యాంగులు కాని వారికి కూడా వైద్యుల చేత ఇప్పించుకున్నారని ఇవన్నీ కూడా అనర్హులని గుర్తించేందుకే ప్రభుత్వం ఒక తనిఖీ చేస్తోంది అంటూ తెలియజేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి అర్హులైన వారందరికీ కూడా పింఛనీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారికి శాశ్వత వలసదారుగా గుర్తించి తాత్కాలికంగా నిలిపివేస్తాము ఆ పించి నేనే అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: