ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అయ్యి అథెంటికేషన్ హిస్టరీలో ఆల్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుని ఫెట్చ్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. మీకు తెలియకుండా ఆధార్ కార్డ్ ను వినియోగించినట్టు తేలితే మాత్రం 1947 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఉడాయ్ వెబ్ సైట్ కు మెయిల్ చేయడం ద్వారా కూడా సహాయం పొందవచ్చు. లాక్ లేదా అన్ లాక్ ఆప్షన్స్ ను వాడటం ద్వారా ఆధార్ బయోమెట్రిక్ ను లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌట్ వస్తే హిస్టరీ చెక్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ విషయంలో తప్పులు చేస్తే మాత్రం బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.
ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే మాత్రం ఆధార్ కార్డ్ వెబ్ సైట్ ద్వారా రీప్రింట్ చేయించుకుని కార్డ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ విషయంలో పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. ఆధార్ కార్డ్ ను ఎక్కువగా వినియోగించేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను ఇతరులకు ఇచ్చే సమయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.