ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అనారోగ్య సమస్యతో గత వారం రోజుల నుంచి హైదరాబాదులో ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట.ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించి కొన్ని నిమిషాల క్రితం మృతి చెందినట్లు సమాచారం . అయితే తన తమ్ముడికి బాగాలేదని తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సైతం రద్దు చేసుకొని మరి తిరుపతికి బయలుదేరినట్లు తెలుస్తోంది.  ఈ రోజున మధ్యాహ్నం సమయంలో నారావారి పల్లెకు సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు 1983లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ (ఐ )పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి నేత వెంకట్రామనాయుడు చేతిలో ఓడిపోయారట.. అలా ఒక్కసారి మాత్రమే చంద్రబాబు ఓడిపోయినప్పటికీ ఎనిమిది సార్లు విజయకేతాన్ని ఎగరవేశారు. కానీ చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మాత్రం చంద్రగిరిలో సవాల్ చేసి మరి గెలిచారట.



చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కూడా టిడిపి మాజీ ఎమ్మెల్యే 1994 నుంచి1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారట. అప్పట్లో ఎన్టీరామారావుగారు రామ్మూర్తి నాయుడుకు పిలిచి మరి టికెట్ ఇచ్చారట. అప్పుడు గళ్ళ అరుణకుమారిని ఓడించారు.. ఆ తర్వాత 1999లో టిడిపి పార్టీని చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్లిన తర్వాత రామ్మూర్తినాయుడుకు టికెట్ ఇవ్వలేదని సమాచారం. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది..రామ్మూర్తినాయుడు ఎవరో కాదు టాలీవుడ్ హీరో అయినా నారా రోహిత్ తండ్రి..


ఇటీవలే నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. వివాహం జరిగే లోపే  తన తండ్రి నారా రోహిత్ తండ్రి మృతి చెందడంతో  తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.. అటు అభిమానులు, అటు నారా కుటుంబ సభ్యులతో పాటు పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు కూడా చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు.నారా రోహిత్ అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ పలు రకాల పోస్టులను షేర్ చేస్తున్నారు. నారా రోహిత్ కు తన తండ్రి లేని లోటు తీరని లోటు అన్నట్లుగా అభిమానులు తెలియజేస్తున్నారు. రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు కూడా తన సొంత గ్రామంలోనే చేయబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: