రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు చేశాడని మా నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపాడని బాబు వెల్లడించారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా రామ్మూర్తి నాయుడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండగా ఈ నెల 14వ తేదీన ఆయన ఆస్పత్రిలో చేరారని సమాచారం.
ఈరోజు ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వినిపించగా 12.45 గంటలకు ఆయన మృతి చెందారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది. 1952 సంవత్సరంలో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1999 సంవత్సరంలో రామ్మూర్తి నాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ
చేశారు.
రామ్మూర్తి నాయుడు మృతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఈ బాధ నుంచి త్వరగా తేరుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్న బాబు కుటుంబంలో చోటు చేసుకున్న ఘటన వల్ల ప్రచారానికి దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి చేసిన కామెంట్లు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.