ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్న ప్పటికీ ఎవరూ సభకు రావడం లేదు. దీంతో ఎటు చూసినా.. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే.. వీరిలో చాలా మంది సభ్యులు సభకు రావడం లేదన్నది ప్రధాన కారణం. అసెంబ్లీకి వచ్చిన వారు.. కార్యదర్శుల కార్యాలయాలకు వెళ్లి.. సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారన్న ది కొన్నిరోజులుగా వినిపిస్తున్న మాట.
వారు వీరు అన్న తేడా లేకుండా.. కూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో రాజకీ యాలు చేస్తున్నారు. దీంతో సభలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. ప్రశ్నించేవారు కూడా కరువ య్యారు. వాస్తవానికి ప్రతిపక్షం సభలో ఉంటే.. ఆ సభ్యులు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. దీంతో సభలో హుందాతనం.. కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా పోయేది. కానీ, ఇప్పుడు మంత్రులు కూడా లైట్ తీసుకుంటున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే.. స్పీకర్‌కు పనితగ్గిపోయింది. ఇది..అయ్యన్నకు ఆగ్రహం తెప్పిస్తోంది. సభా వ్యవహారాల విషయంలో ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు కూడా లైట్ తీసుకోవడాన్ని ఆయన సహించ లేక పోతున్నారు. ఇక, చర్చలు కూడా పెద్దగా లేకుండానే.. సభా వ్యవహారాలు ముగిసిపోతున్నాయి. దీంతో కొందరు మంత్రులపై ఆయన అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి, సభా నాయకుడు చంద్రబాబుకు కూడా అయ్యన్న వివరించినట్టు తెలిసింది. మరి మార్పు వస్తుందో రాదో చూడాలి.