- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అక్కడ రెండు కూటమల మధ్య హారాహోరీ పోరు నడుస్తోంది. ఒక కూట‌మి కాంగ్రెస్ అయితే .. మరో కూటమి కి బిజెపి నాయకత్వం వహిస్తున్నాయి. రెండు కూటమిలలో ఎన్సిపి - శివసేన ఉన్నాయి. చీలిక పార్టీలు బిజెపితో ఉన్న అవే ఒరిజినల్ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అసలు పార్టీలు అయినా కొత్త పార్టీల పేరుతో ఉద్ద‌వ్ తాక్రే - శరద్‌ పవర్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు తర్వాత ఎన్సీపీ కానీ శివసేన కానీ ఒకటే ఉంటుందని అనుకోవచ్చు. మిగిలిన పార్టీలు ఇతర పార్టీలో విలీనం అవుతాయి. అయితే ఇప్పుడు బిజెపి కూటమి గెలవకపోతే జాతీయ రాజకీయాల్లో పెను ప్రభావం కనిపిస్తుందని అంచనాలు వస్తున్నాయి. బిజెపితో పాటు ఉన్న ఎన్సిపి - శివసేనకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలను ప్రజలు ఆదరించకపోతే వారు మాతృ పార్టీలకు వెళ్లిపోతారు. అప్పుడు కేంద్రం మరిన్ని చిక్కుల్లో పడుతుంది. కేంద్ర ప్రభుత్వ మనుగడకు సమస్య రాకపోవచ్చు .. కానీ అది ఇబ్బంది అవుతుంది. అందుకే మహారాష్ట్ర ఎన్నికలను బిజెపి అగ్రనాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధాని మోదీ వరస పర్యటనలు చేస్తున్నారు. ఎన్డీయే పార్టీలన్నింటినీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే మహారాష్ట్రలో బిజెపి చేసిన రాజకీయాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఆ పార్టీ కూటమిని ప్రజలు ఆదరించరు. ఉద్ద‌వ్ థాకరే ప్రభుత్వాన్ని అన్యాయంగా పడగొట్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలా చేసిన కర్ణాటకలో బిజెపి ఘోర పరాజ‌యం పాలైంది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే రిపీట్ అయితే ముందు ముందు ప్రభుత్వాలను కూల్చే విషయంలో బిజెపి ఆలోచించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్న చర్చ‌లు జాతీయ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP