ఆంధ్రప్రదేశ్ లో గత ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ నిరుద్యోగులు డీఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.గత వైసీపీ ప్రభుత్వం డీఎస్సి నోటిఫికేషన్ పై జాప్యం చేస్తూ ఐదు సంవత్సరాలు గడిపేసింది.ఎన్నికలు మరో రెండు నెలలు వున్నాయి అనగా 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.అదికూడా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిపోయింది.దీనితో టీడీపీ ,బీజేపీ ,జనసేన కూటమి తాము అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సి పైనే మొదటి సంతకం పెడతామని నిరుద్యోగులను ఊరించింది..దీనితో కూటమికు   నిరుద్యోగులు భారీగా ఓటు వేసి గెలిపించారు.రాష్ట్రంలో  కూటమి భారీగా స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,347 ల మెగా డీఎస్సి నోటిఫికేషన్ ఫైల్ పై సంతకం చేసారు.డిసెంబర్ లోపు ప్రక్రియ పూర్తికావాలని అధికారులని ఆదేశించారు.కానీ కొత్త అబ్యర్ధులకు అవకాశం కల్పించడం కోసం మరో టెట్ నిర్వహించారు.

దీనితో నవంబర్ 6న నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు.కానీ సడన్ గా ఎస్సి వర్గీకరణ తెరపైకి వచ్చింది.దీనితో నిరుద్యోగులు ఆశలు ఆవిరి అయ్యాయి.తాజాగా ఎస్సి వర్గీకరణపై ప్రభుత్వం ఏక సభ్య కమీషన్ వేసింది.60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.ఎస్సి వర్గీకరణ పూర్తి అయ్యాక కొత్త రిజర్వేషన్స్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.ఏది ఏమైనా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికీ మెగా డీఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ తెలిపారు..ఇదిలా ఉంటే డీఎస్సి అభ్యర్థుల  కోసం ప్రభుత్వం నూతన ఉచిత  శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత గుంటూరులో బీసీ స్టడీ సర్కిల్ ని సందర్శించి డీఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభించారు.డీఎస్సి శిక్షణ కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 220 మంది చొప్పున 5720 మంది బీసీ ,ఎస్సి ,ఎస్టి,ఈబీసీ అభ్యర్థులకు 60 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఎంపికైన అభ్యర్థులకు రూ.1000 రూపాయలు  పుస్తకాల కోసం అలాగే రూ.1500 రూపాయలు స్టయిఫండ్ రూపంలో ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

DSC