ఇటీవల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.. అయితే ఇందులో ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కిదిన కూన రవికుమార్ అసంతృప్తితో మాట్లాడడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాలలో ఈయన మాట్లాడుతూ జిరో అవర్ మీద తన అసంతృప్తిని సైతం తెలియజేశారు.. జీరో అవర్ లో సభ్యులు చెప్పినటువంటి సమస్యలను సైతం పలు రకాల కీలకమైన అంశాలను కూడా ఏ మంత్రి నోటు చేసుకోలేదని ఎక్కడ కనిపించడం లేదని కూడా తెలియజేశారు.


డ్రైవర్ లేని కారుగా జీరో అవర్ మారిపోయిందనే విధంగా మాట్లాడారు. గతంలో ఇలా లేదని సభ్యులు మాట్లాడిన వాటన్నిటిని కూడా నోట్ చేసుకుని వారిని అందుకు సంబంధించి మంత్రులు కూడా బదులు ఇచ్చే సంప్రదాయం ఉండేది అంటూ తెలియజేశారు.. అయితే ఈ విషయం పైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలుగజేసుకొని నిండు సభలలో ఇలాంటి అసత్యాలు మాట్లాడవద్దంటూ కూన రవి కుమారుకి సైతం తెలియజేశారు. మంత్రులు ప్రతి ఒక్క విషయాన్ని నోట్ చేసుకుంటున్నారని మంత్రి అచ్చెమనాయుడు కూడా తెలియజేశారు.



సభలో మాట్లాడే ప్రతి అంశము కూడా మంత్రుల వద్దకు వస్తుంది అని దానిమీద పలు రకాల చర్యలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు.. ఇదంతా చూస్తూ ఉంటే కొంతమంది నేతలు కార్యకర్తలు కూన రవికుమార్ అసంతృప్తిని ఇలా తెలియజేశారు అంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయట. మంత్రి పదవి వస్తుంది అనుకున్న సమయంలో ఈసారి దక్కకపోవడంతో  పాటుగా విప్ పదవి కూడా ఇతర ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. ఇలా టిడిపి ఎమ్మెల్యే అయిన రవికుమార్ కు ఎలాంటి పదవి తక్కువ పోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన అసంతృప్తిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: