కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? త్వరలో అరెస్టు తప్పదా?విశాఖలో కేసు నమోదు దేనికి సంకేతం? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు పర్వం నడుస్తోంది. వందలాది కేసులు నమోదవుతున్నాయి.  అప్పట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడిన సినీ సెలబ్రిటీలపై సైతం కేసులు పెడుతున్నారు. రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రీ రెడ్డి వంటి వారిని అరెస్టు చేసేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ జాబితాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లేకపోవడంతో కొత్త చర్చ ప్రారంభం అయ్యింది.అయితే వీరికి ఈ కేసులతో కాకుండా వేరే కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.



గత ఐదేళ్లుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడారు కొడాలి నాని. బూతులతో రెచ్చిపోయేవారు. మహిళలను సైతం కించపరిచేవారు. వల్లభనేని వంశీది కూడా అదే తీరు. అందుకే వీరిద్దరిపై వేరే కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.సమాజాన్ని ఇబ్బంది పెట్టారన్న కోణంలో వీరిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.


విశాఖలో ఓ విద్యార్థి కొడాలి నాని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ న్యాయ విద్యార్థిని కొడాలి నాని బూతులతో మనస్థాపానికి గురయ్యానని తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం విశేషం. కొడాలి నాని అనే వ్యక్తి రాజకీయ పార్టీ నేత కాదు.. ప్రజా ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఆయన వాడిన భాష పై అనేక అభ్యంతరాలు ఉండేవి. ఒక ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భాష ముఖ్యం అన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు. అప్పట్లో అనుకూల ప్రభుత్వం ఉండడంతో ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది.ఇప్పుడు అదే శాపంగా మారనుంది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ పై కొత్త సెక్షన్లతో కేసులు నమోదు కావడం ఖాయంగా తెలుస్తోంది.


తాజాగా నమోదవుతున్న కేసులు, అందుకు ఫిర్యాదుదారులు చూపుతున్న కారణాలు చూస్తుంటే మాత్రం కొత్త సెక్షన్ల కింద.. కొడాలి నాని పై కేసులు నమోదు చేయడం ఖాయంగా తెలుస్తోంది. లోకేష్ రెడ్ బుక్ థర్డ్ పేజీలో తొలి రెండు పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ అని తేలిపోయింది. వారిద్దరి విషయంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా తెలుస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: