ఆంధ్రప్రదేశ్లోని పాలిటిక్స్ చూస్తే.. ఒకేసారి కంటిన్యూగా రెండుసార్లు అధికారం రావడం చాలా కష్టంగా ఉన్నది.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీలో అయితే ఇది జరుగుతూనే ఉన్నది.. 2014లో టిడిపి పార్టీ ప్రజలు అధికారం ఇచ్చినప్పటికీ 2019లో మళ్లీ ఆ పార్టీ ఓడిపోయింది. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. అప్పట్లో టిడిపి అంత తప్పు ఏం చేసిందో అని కూడా చాలామందికి అర్థం కాలేదట. అయితే 2024 ఫలితాలు చూస్తే వైసీపీకి కూడా దిమ్మతిరిగేలా వచ్చేసాయి. కేవలం 11 స్థానాలకే వైసీపీ పడిపోయింది.


వాస్తవానికి కూటమిలో భాగంగా( టిడిపి, జనసేన, బిజెపి) పార్టీలో ముకుమ్మడిగా రావడంతో టీడీపీకి బాగా కలిసి వచ్చింది. అయినప్పటికీ కూడా వైసీపీకి 40 శాతం ఓటింగ్ తో రాణించారు. కానీ ఏపీ ప్రజల ఆశలకు హద్దు లేకుండా పోతోందట..ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఎవరు ఎక్కువగా పెద్దపీట వేస్తే వారి వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. తమిళ ఓటర్ల మాదిరే ఏపీ ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారని పలువురు నేతలు తెలియజేస్తున్నారు.. అంటే ఒకసారి గెలిచిన పార్టీ మరొకసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరుగుతోంది.


ఏపీ ప్రజల నాడి ఏంటనే విషయం అర్థం కాలేదు కానీ ప్రతి ఐదేళ్లకు ఒకసారి మనసు మార్చుకుంటున్నట్టుగా మాత్రం కనిపిస్తోంది. ఇదే గడిచిన మూడు ఎన్నికలలో తీరు ఇలానే ఉన్నది. ఇటీవల వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ప్రజల ఆశలను ఏ ప్రభుత్వం కూడా మ్యాచ్ చేయలేకపోతోంది అంటూ తెలిపారు.. ఈ విధంగా చూసుకుంటే 2029 లో ఎన్నికలు జరిగితే టిడిపి కూటమి ఎంత బాగా చేసినా కూడా ప్రజలు క్రెడిట్ మాత్రం ఇవ్వారని కచ్చితంగా మనసు మార్చుకుంటారని తెలిపారు. అందుకే వైసీపీకి కచ్చితంగా మళ్ళీ అధికారం దక్కుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలకు ప్రస్తుతమైతే పెదవి వివరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఒకవేళ జమిలి ఎన్నికలు కూడా వచ్చాయి అంటే మరొక ఆప్షన్ ఏపీ ప్రజలకు లేదు కేవలం వైసీపీ మాత్రమే ఉందని తెలిపారు.


తమిళనాడులో డీఎంకే అన్న డీఎంకే అన్నట్లుగా రాజకీయం అయితే కొనసాగుతూ ఉండేది.. కానీ 2016లో మాత్రం రెండవసారి వరుసగా జయలలిత సిఎంఐ ఆ రికార్డును బ్రేక్ చేసిందట. ఆంధ్రాలో కూడా ప్రతి ఎన్నికలలో మార్పు కనిపిస్తూనే ఉన్నది. ఈ లెక్కన చూసుకుంటే ఈ సెంటిమెంట్ ట్రాక్ వైసీపీ నేతలకు కాస్త ఊరటనిస్తోంది. మరి 2019లో టిడిపి చేసిన తప్పులను సరిచూసుకొని మరి మిత్రులతో జతకట్టి కూటమిగా అయితే 2024లో గెలిచింది.. మరి కేవలం కూటమి వైసీపీ పార్టీనే ఉండడంతో కూటమి కాదంటే వైసీపీ పార్టీకే ప్రజలు ఓటు వేసేలా ఉన్నారు. మరి ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: