టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ హై కోర్టులో వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్‌ చేయకుండా ఆపాలన్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పిటీషన్‌ పై ఏపీ హై కోర్టు ఆయనకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. తాజాగా తనపై ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టు లో పిటిషన్ వేశారు టాలీవుడ్‌ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.

అయితే.. టాలీవుడ్‌ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ  వేసిన  పిటిషన్ ను ఏపీ హై కోర్టు ఇవాళ విచారించింది.  ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీ హై కోర్టు.  ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను... ఏపీ హై కోర్టు తిరస్కరించింది.  అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్‌ ఇచ్చింది ఏపీ హై కోర్టు.


దీంతో ఏపీ హై కోర్టులో వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు నిరాశ ఎదురైంది.  ఇక రేపు విచారణ హాజరు కావాలంటూ  వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు పోలీసులు నోటీసులు  ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది... కోర్టుకు వెల్లడించడం జరిగింది.  హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టును  వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది కోరడం జరిగింది.

అయితే.. దీనిపై కూడా ఏపీ హై కోర్టు షాక్‌ ఇచ్చింది. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించిన హై కోర్టు..  వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు మరో షాక్‌ ఇచ్చింది.  ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయ మూర్తికి తెలిపింది. ఇది ఇలా ఉండగా.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో పాల్గొన్నారు వర్మ. ఈ తరుణంలోనే...  అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దారుణంగా కామెంట్స్‌ చేశారు  వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. దీంతో టీడీపీ నేత , మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv