తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలకు సర్వ దర్శనానికి వచ్చే భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను మాత్రం ప్రభుత్వానికి అప్పగించనుందని తెలుస్తోంది.
 
శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డ్ లోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని ఆయన కామెంట్లు చేశారు. ప్రైవేట్ బ్యాంకులలో నగదును సైతం ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు.
 
శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామని బీఆర్ నాయుడు వెల్లడించారు. కొత్తగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతుల ను సైతం రద్దు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు.
 
బీఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయాలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ నాయుడు రాబోయే రోజుల్లో తిరుమలకు మేలు జరిగేలా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పై సామాన్యుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో తిరుమల మరింత శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. తిరుమలలో ప్రజలు కోరుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఛైర్మన్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.








మరింత సమాచారం తెలుసుకోండి: