ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందులో భాగంగానే వచ్చే వారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు టి ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నారట. నెలకు 20mbbs అన్లిమిటెడ్ డేటా ని కేవలం రూ .149 రూపాయలకే అందించబోతున్నట్లు తెలియజేశారు.. టి ఫైబర్ ద్వారా తెలంగాణలో ఉండే 8919 గ్రామాలకు నెట్వర్క్ ని ఏర్పాటు చేశారట. దీంతో పాటుగా మరో మూడు వేల గ్రామాలకు bsnl సంస్థ కనెక్షన్ ని అందించబోతున్నట్లు తెలియజేశారు.. ముఖ్యంగా రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఉన్నాయి.
ఇవే కాకుండా గిరిజన ప్రాంతాలలో కూడా 799 గ్రామపంచాయతీలకు ఇంకా నెట్వర్క్ ని అందించాల్సి ఉన్నదట. అయితే కొన్ని ప్రాంతాలలో నెట్వర్క్ ని అమలు చేయడానికి అటవీ శాఖ అనుమతి కావాల్సి ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారట. అక్కడ ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి రెండు వారాల లోపు అనుమతి ఇస్తామని తెలియజేశారట. టీ ఫైబర్ ద్వారా అందించే ఇంటర్నెట్ కనెక్షన్ 3 వేరియేషన్లు కనెక్షన్ చేయబడుతుందట. ఏవైనా కొన్ని కారణాల చేత ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయితే మరొక మార్గం ద్వారా పునరుద్దించే విధంగా ప్లాన్ చేస్తారట.. అకాల వర్షాలు, భారీగాలులు, రోడ్లు వేయడం వంటి కారణాల చేత ఇంటర్నెట్ ఆగిపోకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండకూడదని ఉద్దేశంతోనే ఇలాంటివి చేస్తున్నారట. మరి అతి తక్కువ ధరకే ఎక్కువ స్పీడ్ అన్లిమిటెడ్ నెట్ అందుబాటులో ఉండడం తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.