ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అదే సమయంలో ఇండస్ట్రీలోని ఒక వర్గానికి చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీకి సపోర్ట్ చేసి ఇష్టానుసారం కామెంట్లు చేసిన సెలబ్రిటీల విషయంలో బాబు సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది.
 
నోరు జారితే శిక్ష తప్పదని బాబు సర్కార్ ప్రూవ్ చేస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీకి అనుకూలంగా పలు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోయినా బాబు, బాబు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు రిలీజైన సమయంలో సైతం ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.
 
శ్రీరెడ్డి సైతం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలొ సోషల్ మీడియా వేదికగా పలకడానికి, రాయడానికి అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేశారు. శ్రీరెడ్డి భాష మరీ దారుణంగా ఉండటంతో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. శ్రీరెడ్డి ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నా ఆమెను క్షమించడానికి కూటమి నేతలు అస్సలు ఇష్టపడరనే సంగతి తెలిసిందే.
 
పోసాని కృష్ణమురళి సైతం అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ద్వారా పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. పోసానిని సైతం త్వరలో అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆర్జీవీ, శ్రీరెడ్డి, పోసానిలకు భారీ షాకులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి సపోర్ట్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రస్తుతం అరెస్ట్ భయంతో గజగజా వణుకుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సినిమా సెలబ్రిటీలు రాజకీయాలకు సంబంధించి మాట్లాడే మాటల విషయంలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని చెప్పవచ్చు. ఇష్టానుసారం కామెంట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: