డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మాటలు మాత్రమే కాదు చేతల్లో కూడా ఆయన హిందూ ధర్మాన్ని రక్షించే పనులు చేసి చూపిస్తున్నారు. బీజేపీ పార్టీ హిందూ ధర్మం రక్షణకై పాటుపడుతుందని సంగతి తెలిసిందే. అయితే పార్టీలో ఉన్న వారి కంటే పవన్ కళ్యాణే సనాతన ధర్మ రక్షించడానికి కృషి చేస్తున్నారు. అందుకే బీజేపీ పార్టీకి ఇతరుల కంటే ఆయనే ఒక పెద్ద అండగా కనిపిస్తున్నారు. త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అక్కడ సత్యకుమార్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలుగువారిలో ఆయనను మినహాయించి అక్కడ ప్రచారం నిర్వహించేవారు ఒక పవన్ కళ్యాణే.

 అయితే అక్కడ సత్య కుమార్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు తెలుగు వారు అక్కడ ఉన్నారు కానీ ఈ తెలుగు వారి గురించి వారికి పెద్దగా ఇచ్చింది లేదు అందువల్ల అతని ర్యాలీలో అక్కడి ప్రజలు పెద్దగా పాల్గొనలేదు జన సమీకరణలో సత్య కుమార్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. బీజేపీ ఎలాంటి కాంట్రిబ్యూషన్ అంది ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారాలకి మాత్రం భారీ స్పందన లభిస్తుంది. సనాతన ధర్మం భారతదేశంలో సర్వనాశనం కాకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు పవన్. ఆ నినాదం ప్రజలకు నచ్చడంతో ఆయన ర్యాలీలలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.

 మిగతా పార్టీ వాళ్లకు కూడా పవన్ చాలా బలమైన కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ గెలవాలని జనసేన కార్యకర్తలు కూడా ఆశిస్తున్నారు అంతేకాదు ఇటీవల పిఠాపురంలోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలోని భగవానుడు జగత్గురు శ్రీ దత్తాత్రేయకు ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలో  బీజేపీ గెలవాలని వారు ఈ పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ బీజేపీ కార్యకర్తలు కూడా ఇలాంటి పనిచేయలేదు కానీ జనసేన కార్యకర్తలు బీజేపీ కోసం ఇలాంటి ఒక మంచి పని చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. పవన్ లాగా వారు కూడా నిస్వార్థంగా ప్రవర్తిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp