వైసిపి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయిరెడ్డికి ఇప్పుడు తాజాగా ఒక అరుదైన అవకాశం దక్కిందట. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది అయినప్పటికీ కూడా వైసిపి ఎంపీ కి ఒక గొప్ప అవకాశం లభించింది. అదేమిటంటే 79 వ సదస్సు కు హాజరయ్యే భారత ప్రతినిధి బృందంలో వివిధ పార్టీలకు సైతం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో వైసిపి నేతగా పేరుపొందిన విజయసాయిరెడ్డి పేరు ఉండడం ఇప్పుడు విశేషము అని చెప్పవచ్చు. కేంద్రం ప్రభుత్వం వైసీపీ పార్టీకి ఈ విధంగా అవకాశం ఇవ్వడం వల్ల ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చ కొనసాగుతున్నది.


30 ఏళ్ల  క్రితం పీవీ నరసింహారావు, అటల్ బిహారి వాజ్ పాయ్ ఐక్యరాజ్యసమితికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందానికి లీడర్ గా ఎంపిక చేయడం జరిగిందట .అప్పట్లో ఇది చాలా చర్చనీ అంశంగా మారింది. ఎందుకంటే అధికార పార్టీ తరఫునుంచి ప్రాతినిధ్యం వహిస్తారని అనుకున్నప్పటికీ కానీ వివక్ష పార్టీకి అప్పగించడంతో అప్పట్లో కొంతమంది నేతలు నానా హంగామా చేశారట. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఐక్యరాజ్యసమితికి వెళ్లే అవకాశం కల్పించడానికి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ పట్ల ఇంకా బాండింగ్ ఉందని చాలామంది నేతలు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు.


ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైతం సందర్శించిన విజయసాయిరెడ్డి.. అక్కడే మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరి వైసీపీ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి 79వ ఐక్యరాజ్యసమితి సెషన్ లో పాల్గొనడం గొప్ప గౌరవం అని కూడా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పార్లమెంటులో కూడా సీనియర్ నేతగానే పేరు సంపాదించారు. మొత్తానికి వైసీపీ పార్టీకి మరొక బూస్ట్ లాంటిది ఇది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: