తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల రాజ్యాంగ ఉండేది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రిగా అలాగే మొన్నటి వరకు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అయితే ఈ ఫార్ములకు చెక్ పెట్టి బిజెపికి షాక్ ఇచ్చేలా రంగం సిద్ధం చేసింది  కాంగ్రెస్ పార్టీ.

 ఇందులో భాగంగానే తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డిని పక్కకు జరిపి... బీసీ నాయకుడైన మహేష్ గౌడ్ కు అధ్యక్ష పదవి ఇచ్చింది. ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా బీసీ నేత అయిన మహేష్ గౌడు బాధ్యతలు కూడా తీసుకున్నారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే మొన్నటి వరకు బీసీ అయిన బండి సంజయ్ ని పక్కకు పెట్టి... రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డికి... పదవి ఇచ్చింది బిజెపి.

అంటే...ఇప్పుడు బీసీలకు బిజెపి పార్టీ అన్యాయం... చేస్తోందని...  ఒక మెసేజ్ జనాల్లోకి వెళ్లేలా కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ కు పదవి ఇచ్చింది. అయితే ఇదే ఫార్ములాను వచ్చే ఎన్నికల్లో కూడా వినియోగించనుంది. వచ్చే ఎన్నికల సమయానికి కాంగ్రెస్... బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 బీసీ నినాదం ఎత్తుకుంటే గులాబీ పార్టీ అలాగే బిజెపికి... చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ బీసీ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంటే రేవంత్ రెడ్డికి షాక్ తగలక తప్పదు. ఎందుకంటే మరోసారి ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ బీసీ నినాదాలు ఎత్తుకుంటే రేవంత్ రెడ్డికి ఇదే చివరిసారి ముఖ్యమంత్రి కావడం అవుతుంది.  కాబట్టి కేంద్రంలో ఉన్న బిజెపిని దెబ్బ కొట్టేందుకు... కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో రేవంత్ రెడ్డికి కూడా షాక్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు కేసీఆర్ పార్టీకి కూడా ఇది షాక్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: