రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా రైతులకు హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఇప్పటికే ఐదు నెలలు కావస్తూ ఉన్న వీటి పైన విధివిధానాల పై ఇంకా ఎటువంటి కార్యచరణ చేపట్టలేదు. ఇటీవలె బడ్జెట్ సమావేశాలలో కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకం పైన ప్రతి సంవత్సరం అర్హులైన అన్నదాతలకు పెట్టుబడి సహాయం కింద ₹20,000 అందిస్తామంటూ అందుకు సంబంధించి బడ్జెట్లో కూడా 4,500 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.


ఈ 20వేల రూపాయల 14 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరువేల రూపాయలు కలిపే ఉంటుందని తెలిపారు. గతంలో వైసీపీ పాలనలో 12,500 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించినప్పటికీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7,500.. కేంద్రం ఇస్తున్న 6000 రూపాయలను కలిపి 13,500 మాత్రమే ఇచ్చారని ఫైరయ్యారు. అంతేకాకుండా గత ఐదేళ్ల పాలనలో రైతులకు ఎలాంటి భూసార పరీక్షలు ఉద్యాన పంటలు పండించే రైతులకు ఎటువంటి పరికరాలను కూడా అందించలేదని తెలిపారు.



అంతేకాకుండా పంట బీమా చేయకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఫైర్ అయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని వస్తున్నామని అన్నిటినీ కూడా రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తున్నామంటే తెలుపుతున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాత ఎటువంటి పథకాన్ని అయినా సరే అమలు చేసి తీరుతామని.. అన్నదాత సుఖీభవ నిధుల పైన రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని.. త్వరలోనే ఇందుకు సంబంధించి 20వేల రూపాయలను సీఎం చంద్రబాబు కూడా విడుదల చేస్తారని తెలియజేశారు.


ఈ పథకానికి అర్హులకు ఎటువంటి కండిషన్స్ ఉండాలి.. ఎంత భూమి ఉండాలి ఎవరెవరు అర్హులు అనే విషయం పైన పరిశీలిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కి ఎవరెవరు అర్హులు త్వరలోనే అందుకు తగ్గట్టుగా నియమాలను కూడా విడుదల చేయబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: