విశాఖలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని దగ్గర అయ్యి ఆ తర్వాత తాను బలవంతంగా అనుభవించడం మాత్రమే కాకుండా తన స్నేహితులతో కలిసి కూడా అత్యాచారం చేయించిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడుతో ఏకాంతంగా గడిపిన వీడియోలను చూపించి ఆ యువతని భయపెట్టి అనుభవించడం మాత్రమే కాకుండా మళ్లీ కూడా ఒప్పుకోవాలి అని తీవ్రంగా ఒత్తిడి చేయడం దానికి ఆమె ప్రియుడు కూడా అంగీకరించమని బలవంత పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన యువతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.

దీనితో ఆ యువతి తండ్రి ఆమెను అడిగి అన్ని విషయాలు తెలుసుకోగా అతనికి అసలు విషయం తెలిసింది. దానితో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విశాఖ టు టౌన్ సిఐ తిరుమలరావు యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశాడు. విశాఖకు చెందిన ఎల్ఎల్బి విద్యను అభ్యసిస్తున్న 20 సంవత్సరాల అమ్మాయికి వంశీ అనే అబ్బాయి తో పరిచయం ఏర్పడింది. ఈ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతీ నిరాకరించిన కూడా ఆమెను బలవంతంగా అనుభవించాడు. ఆ తర్వాత కూడా మరోసారి ఆమెను బలవంతంగా అనుభవించాడు. దానిని రహస్యంగా చిత్రీకరించిన వంశీ స్నేహితులు అది చూపించి ఆ యువతని భయపెట్టడం మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆమెను అత్యాచారం చేశారు. ఇక యువతిపై అత్యాచారం చేసిన నలుగురిలో ముగ్గురు న్యాయవాద విద్యను అభ్యసిస్తూ ఉండగా ... ఒకరు మాత్రం ప్రైవేట్ మోటార్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇక ప్రియుడే దగ్గరుండి ఆమెను హత్యాచారం చేయించడానికి పాల్పడడంతో ఆమె ప్రియుడిని నిందించింది. కానీ ప్రియుడు కూడా ఆమెను తిరిగి బెదిరించడంతో ఏమీ చేయలేని ఆమె హత్యాచారానికి పాల్పడింది. ఇక ఆ విషయం తర్వాత కుటుంబ సభ్యులకు తెలియడం , వారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో విషయం అంతా బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: