ఏపీ అసెంబ్లీ మొత్తం ఏడాదితో సమావేశం అయ్యేది 30 నుంచి 40 రోజులుగా ఉంటుంది. ఉమ్మడి ఏపీలో అయితే 60 నుంచి 70 రోజుల పాటు సభలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి అసెంబ్లీకి వైసీపీ మొత్తం గైర్ హాజరు అయింది. దాంతో కూటమిలో చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు పది రోజులకు పైగా సాగినా వైసీపీ రాకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలే సభలో ఉన్నట్లు అయింది.
జగన్ సహా మిగిలిన పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఒత్తిడి వస్తోంది. ఇక జగన్ మీడియా సమావేశం పెడితే మీడియా ప్రతినిధి ఒకరు ఇదే విషయం మీద ప్రశ్నించారు. వైసీపీ మీద అనర్హత వేటు వేయమనండి చూద్దామని జగన్ సవాల్ కూడా చేశారు. అయితే జగన్ మీద కానీ ఏ ఎమ్మెల్యే మీద కానీ వేటు వేయడం అంత సులువు కాదని అంటున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 190ని చాలా మంది ప్రస్తావిస్తున్నారు. దాని ప్రకారం సభను నిరాటంకంగా అరవై రోజుల పాటు నిర్వహించాలి. అలా నిర్వహించినపుడు ఒక సభ్యుడు సభకు సభకు గైర్ హాజరు అయితే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది.
అయితే ఇది చాలా పెద్ద ప్రయత్నం.
దేశంలో ఏ సభ కూడా ఇన్నేసి రోజులు ఏకబిగిన సాగిన దాఖలాలు లేవు. ఆఖరుకు 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ కూడా రెండు విడతలుగా బడ్జెట్ సెషన్ నిర్వహిస్తుంది కానీ ఏక బిగిన కాదు. మరి ఏపీ అసెంబ్లీ అలా రెండు నెలల పాటు సమావేశం జరుపుకుంటుంది అంటే చూడాలని అంటున్నారు. జగన్ సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు చేయించాలి. అంటే అలా సభ జరపాల్సిందే అని అంటున్నారు.
ఆ మొత్తం రోజులలో ఏదో ఒక రోజు జగన్ సభకు వచ్చినా ఆయన ఎమ్మెల్యేలు వచ్చినా వారి సభ్యత్వం పోయేది ఉండదు. మరి దాని కోసం ఏక బిగిన అరవై రోజులు సభ జరుపుతారా అన్నది ఒక చర్చ.