ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్ తెలియజేశారు.. అదేమిటంటే జాతీయస్థాయిలో పేరుపొందిన కంపెనీలతో కూడా 99 రూపాయలకే మధ్యాన్ని అందించాలనే విధంగా కూటమి ప్రభుత్వం భావిస్తోందంటూ ఒక కీలకమైన ప్రకటన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 99 రూపాయలకే మద్యం అందిస్తామని చెప్పడంతో కూటమి ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందని ఇప్పటివరకు ఐదు లక్షల కేసులకు పైగా విక్రయించారని సమాచారం. జాతీయస్థాయిలో బ్రాండ్లు కూడా భారీగా సేల్స్ అవ్వడంతో మరిన్ని ఉత్పత్తులను పెంచుకుంటూనే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని కూడా తెలియజేశారు..



ఇప్పటికే పలు రకాల కంపెనీలతో కూడా సంప్రదింపులు జరిపామంటూ కూటమి ప్రభుత్వం తెలిపారు.ప్రభుత్వ మద్యం షాపుల్ని పెంచలేదని గత ఐదేళ్లలో కల్తీ మద్యం తాగి చాలామంది ప్రజలు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ తెలిపారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులను ప్రైవేటీకరణం చేశామని నాణ్యమైన మద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామంటూ తెలిపారు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత 1800 కోట్ల ఆదాయం వచ్చింది అంటూ తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.


గత ప్రభుత్వం లో ఇంటర్నేషనల్ బ్రాండ్లను సైతం అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని ప్రస్తుతం 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని. కొత్త మద్యం విధానాన్ని కూడా తీసుకువచ్చి మద్యం ధరను మరింత తగ్గించామంటూ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అమ్మినటువంటి మద్యం అక్రమాల పైన కూడా సిఐడి విచారణ జరుగుతుంది అంటూ తెలియజేశారు. రూ .99 రూపాయలకే చీప్ లిక్కర్ అన్నిచోట్ల తీసుకువస్తామంటూ తెలియజేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇతర రాష్ట్రాలలో కంటే చౌక ధరకే ఉండేలా చేశామని.. అందుకు తగ్గట్టుగా టెండర్ కమిటీని కూడా వేసామని తెలుపుతున్నారు. గతంలో 3,396 షాపులకే టెండర్లు వేయించి లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించామని ఇందులో 10 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయించామని తెలిపారు. బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: