మీ హయాంలో ఏం జరిగిందో తెలుసుకోండి! అంటూ అనిత చెప్పిన గణాంకాలతో వైసీపీ నాయకులకు మాట లేకుండా పోయింది. దీంతో సభ నుంచి వాకౌట్ చేసే పరిస్థితి వచ్చింది. వాకౌట్ చేయడం తప్పుకాక పోయినా.. ఓ మహిళామంత్రిని సైతం దీటుగా ఎదిరించలేక పోవడం మాత్రం చర్చకు వచ్చింది. 2014-19కి, 2019-24 మధ్య జరిగిన మహిళలపై అఘాయిత్యాలపై మాట్లాడిన మంత్రి అనిత.. సర్కారు తరఫున చేసిన వ్యాఖ్యలు రికార్డు సృష్టించాయనే చెప్పాలి.
ఎక్కడా తగ్గకుండా ఆమె దూకుడు ప్రదర్శించారు. బలమైన ఆధారాలు, గణాంకాలతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టించారు. ఆ విషయం ఈ విషయం అన్న తేడా లేకుండా.. అన్ని అంశాల్లోనూ హోం వర్క్ స్పష్టంగా కనిపించింది. ఎక్కడా తడబాటు లేకుండా అనిత చేసిన ప్రసంగానికి అధికార పక్షం నేతలు కూడా ముగ్ధులై చూస్తూ ఉండిపోయారు. నిజానికి గతంలోనూ ఎమ్మెల్యేగా చేసినా.. ఇంత బలమైన గళం ఎప్పుడూ అనిత వినిపించలేదు.
కానీ, తాజాగా అనిత దూకుడు చూసిన తర్వాత.. ఇక, ఆమెకు తిరుగులేదు.. అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మండలిలో టీడీపీకి బలమైన సంఖ్యలో సభ్యులులేరు. దీంతో మంత్రులకే ఆ బాధ్యత అప్పగించారు. ఇలాంటి కీలక సమయంలో అనిత దూకుడు ప్రదర్శించడం వైసీపీని కట్టడిచేయడం.. సబ్జక్టు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్లడం వంటివిఅనిత రాజకీయ జీవితంలో ఆమెకు ఒక మైలు రాయిగా నిలిచిందనే చెప్పాలి. చంద్రబాబు బ్యాచ్‌కు బలమైన గళం లభించినట్టేనని అంటున్నారు పరిశీలకులు.