శాసనమండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అడగగా.. డోలా బాల వీరాంజనేయ స్వామి ఇలా బదిలిస్తూ వాలంటరీ వ్యవస్థ అనేదే లేదని వాలంటీర్లను రెగ్యులర్ చేయలేదు గత ప్రభుత్వమంటూ తెలియజేశారు. గత ఏడాది ఆగస్టు తర్వాత వాలంటరీ వ్యవస్థను రెగ్యులర్ చేస్తూ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదంటూ తెలియజేశారు. అందుకే ఏపీలో వాలంటరీ వ్యవస్థ మనుగడ లేకుండా పోయింది అంటూ మంత్రి వీరాంజనేయ స్వామి తెలియజేశారు. మొదట వాలంటరీలను కొనసాగించడానికి ప్రభుత్వం ఆలోచించిందని కానీ ఆ వ్యవస్థ లేనిచోట ఎలా అన్నట్లుగా తెలియజేశారు.
దీన్ని బట్టి చూస్తే వాలంటరీ వ్యవస్థ మాత్రం ఇకమీదట కనిపించదనే విధంగా చెప్పవచ్చు. మొత్తం వాలంటరీ వ్యవస్థ రద్దు అనేది గత ప్రభుత్వమే చేసేసింది అంటూ కూటమి ప్రభుత్వ వైసిపి పార్టీ పైన నెట్టేసింది. దీన్నిబట్టి చూస్తే వాలంటరీలకు గట్టి షాపు కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పవచ్చు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల 60 వేల మంది వాలంటరీలను తీసుకోవడం జరిగింది.. 2023 సెప్టెంబర్ తరువాత దీనిపైన ఎటువంటి రెగ్యులర్ ఉత్తర్వులు చేయలేదని కూటమి ప్రభుత్వం చెబుతోంది ఒక విధంగా చెప్పాలి అంటే ఇందులో చాలామంది రాజీనామా చేసిన వారిని పక్కన పెడితే ఇంకా లక్షన్నర మంది పైగా ఉన్నారు. వీరందరికీ పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలి అంటే చాలా ఖర్చవుతుంది కనుక ఇకమీదట కూటమి ప్రభుత్వం వాలంటీలను పక్కన పెట్టినట్టే అని తెలిసిపోతోంది.