ఒకవేళ రాజకీయాలకు తాను దూరం కావాల్సి వస్తే ఖచ్చితంగా ఏ పార్టీలోకి వెళ్ళను అంటూ కరాకండిగా చెప్పేశారు. త్వరలోనే మళ్లీ రాజకీయాలలోకి చురుగ్గా పాల్గొంటానని తనను ఏదో విధంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని కూడా తెలియజేయడం జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగానే ఉండాలని ఎందరో మహానుభావులు జైలుకు వెళ్లాలని జైలు చూసి తాను భయపడను అంటూ తెలియజేశారు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్.
జిల్లాలో సునకానందం పొందుతున్న కొంతమంది నేతలు అధికారంలోకి వచ్చామని తమకు మించిన వీరులు లేరు అనుకుంటున్నారు అలా అనుకున్న వారందరూ ఎంతోమంది కాలగర్భంలోనే కలిసిపోయారని తెలిపారు.. తాను ఇంకా యువకుడినే అని మళ్లీ మేము అధికారంలోకి వస్తామంటూ ధీమాని తెలిపారు. ఆరోజున తమ తడాఖా చూపిస్తామని వెల్లడించారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి పోటీ చేసినప్పటికీ కూడా అక్కడి ప్రజలు తమను ఎంతగానో ఆదరించారు. ఎమ్మెల్యేల కంటే 40 వేల ఓట్ల అధికం తనకు వచ్చింది అని తెలిపారు. తాను ఏ ప్రాంతంలో పర్యటిస్తే ఆ ప్రాంతంలోని వారందరి పైన దాడులు చేయిస్తున్నారని.. ఎవరు ఎంత ఇస్తే అంత డబుల్ గానే తిరిగి ఇచ్చేస్తామంటూ తెలిపారు అనిల్ కుమార్ యాదవ్.