విజయవాడకి చెందిన కారంపూడి రవీంద్ర అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా టిడిపిలో చాలా యాక్టివ్గానే ఉండేవారట.. అయితే ఈయనకు 20 లక్షల రూపాయలు అప్పు ఉన్నదని వీటి కోసం కొంతమంది నాయకులు ఇబ్బంది పెట్టారట.అయితే ఆ సమయంలో ఆయన అప్పు తీర్చడానికి ఒక ఆలోచన చేశారట. అదేమిటంటే.. ఇతడి భూమి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని వైసిపి నాయకులు ఆధీనంలో పెట్టుకున్నారట. అయితే 20 లక్షల రూపాయలు సర్దుబాటు చేసి ఆ తర్వాత డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే ఇలా కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వలేదట.
అయితే ఈయన ఆస్తి కోల్పోయిన బాధలో రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. అయితే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని చాలామంది నేతలు ఈయనకు హామీ ఇచ్చారట. కానీ చివరికి ఎలాంటి న్యాయం చేయలేదని చివరికి ఆత్మహత్య చేసుకున్నారట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకు రవీంద్ర వంటి వారు ఎంతో కష్టపడి పని చేసిన కానీ ఆయనను వెనక్కి నెట్టి ఇతర పార్టీలలో నుంచి టిడిపిలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక రకంగా ఇది రవీంద్ర ఆత్మహత్యకు కూడా కారణమయ్యేందని అతని స్నేహితులు ఏర్పాటుచేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారుతోంది.
రవీంద్ర స్నేహితులు ఇలా ఫ్లెక్సీ మీద రాసుకోస్తూ.."నాయకులారా వ్యక్తిగత అవసరాల కోసం ఇతర పార్టీలలోకి మారి కొంతమంది జనాలతో లూచీలుపడి.. ఆర్థికంగా చితికిపోయి పార్టీనే నమ్ముకున్నటువంటి వారిని బలి పశువులను చేయవద్దు.. తమని ఎన్ని కష్టాలు పెట్టిన కూడా పార్టీ మారకుండా అధికారం వస్తే పార్టీ నాయకులు న్యాయం చేస్తారని నమ్మి మోసపోయిన మిత్రమా.. నీకు ఇవే మా కన్నీటి నివాళులు అంటూ ఒక ఫ్లెక్సీని సైతం రవీంద్ర స్నేహితులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు చూసిన చాలా మంది కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరి కొంతమంది నేతలు సులభంగా ఇతర పార్టీలలోకి చేరుతారు.. కానీ కార్యకర్తలను పట్టించుకునే వారు ఉండరంటూ వాపోతున్నారు.