భారతదేశంలో అపార కుబేరుడు అయిన గౌతం అదాని గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే అపర కుబేరుడిగా గౌతమ్ అధాని మారిపోయారు. ముఖేష్ అంబానీ కంటే అతి తక్కువ కాలంలో కోట్లకు ఎగబాకారు. అలాంటి గౌతమ్ అదాని ఇప్పుడు చిక్కులో పడ్డారు. తాజాగా అపర కుబేరుడు గౌతమ్ అధాని పైన కేసు బుక్ అయింది. అమెరికా దేశం నుంచి అరెస్ట్ వారెంట్ నోటీసులు కూడా రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం నెలకొంది.

 ఇండియాలోని సోలార్ పవర్ ఉత్పత్తి కోసం ఏకంగా 20 సంవత్సరాల కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు.. గౌతమ్ ఆదానీ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్లు అలాగే వరల్డ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి నిధులు సేకరించాలని ఆయన... ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కాంట్రాక్టు దక్కించుకోవడం కోసం లంచం ఇచ్చారట అదానీ.

ఒకటి కాదు రెండు కాదు..  ఏకంగా రెండువేల 100 కోట్లు ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్లకు... లంచం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే...  అమెరికాలోని ఫెడరల్ కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఇందులో అదాని ఎనర్జీ కంపెనీ అలాగే యూఎస్ ఇష్యూ యార్  రెండు కంపెనీలు ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం. ఈ తరుణంలోనే...  అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు అదానిపై ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో వాళ్లు కేసు వేయడం కారణంగా అదానికి చిక్కులు వచ్చాయి.

అయితే...  అదానీ పైన ఉన్న అరెస్టు వారెంట్ నేపథ్యంలో వైసిపి నేతలకు చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా కోర్టు ద్వారా అధాని నిరారోపణలో కొంతమంది... ఏపీకి చెందిన లీడర్లు కూడా ఉన్నారట. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఓ రాజకీయ నాయకుడు... కూడా అదాని కుట్రలో భాగమయ్యాడట. అతని పేరు కోర్టు ప్రస్తావించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీంతో వైసీపీకి చెందిన వ్యక్తి కావచ్చు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: