ఏపీలో అప్పు లెక్కలు తేలడం కష్టంగా ఉంది. ఎపీ అప్పుల కుప్ప అని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే ఏపీలో అప్పులు తమ హయాంలోనే తక్కువగా ఉన్నాయని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏపీ అప్పు ఎంత అన్నది మాత్రం కంఫ్యూజ్ గానే ఉంది. అధికారిక లెక్కలు వివిధ ఏజెన్సీలు తేల్చిన లెక్కలు చూస్తే కూడా అర్ధం కాని పరిస్థితిగా ఉంది.
కాగ్ నివేదిక ప్రకారం చూస్తే ఏపీ అప్పులు అక్షరాలా 4,38, 278 కోట్ల రూపాయలుగా ఉంది. కాంగ్ నివేదికను శాసనమండలిలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అందులో ఏపీ అప్పుల గురించి ఆయన సభకు తెలియచేశారు. గత వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని విభాగాలలో అప్పులు బకాయిలు పెట్టి వైసీపీ సర్కార్ దిగిపోయింది అని అన్నారు. ఏపీలో టిడ్కో లబ్దిదారులకు పాతిక వేల రూపాయలు ఇస్తామని చెప్పి బకాయి పెట్టారని నిందించారు. ఈ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పిందని ఆక్షేపించారు.
ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా నిధులు అన్నీ మళించారని పయ్యావుల ఘాటు ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో అప్పులు బాగా పెరిగాయని అన్నారు. అయితే దీనిని వైసీపీ నుంచి కౌంటర్లు వెళ్తున్నాయి. అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చూపిస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో చేసిన అప్పుల గురించి తప్పుగా చెబుతోందని జగన్ అంటున్నారు. తమ హయాంలోనే అప్పులు తక్కువ అని జగన్ మీడియా సమావేశంలో చెప్పారు. 2019లో టీడీపీ దిగిపోయిన తరువాత మూడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో తమకు ఖజనా వచ్చిందని అన్నారు. ఇక తాము దిగిపోయే నాటికి అప్పు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలుగానే ఉంది అని అన్నారు. అంటే వైసీపీ అధినేత చెప్పిన దాని ప్రకారం మూడు లక్షల కోట్ల రూపాయలే అప్పులు చేసినట్లుగా అంటున్నారు.
అప్పులు ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలను చూపించారని అది తప్పు అని కూడా చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వం చూపించిన అప్పులతో పాటు పెట్టిన బకాయిలు వివిధ రంగాలకు చెందాల్సిన నిధులను తరలిచిన వైనం అన్నీ ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం వైసీపీ అప్పులు భారీ ఎత్తున చేసిందని విమర్శిస్తున్నారు. మరి ఈ అప్పులలో ఏది నిజం, ఏది అధికారికంగా ఉన్న లెక్క అంటే ఎవరి వాదనలు వారివిగానే ఉన్నాయని అంటున్నారు.