ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ నియామకం పైన కొత్త రాద్దాంతం... నడుస్తోంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. దీనిపై న్యాయపోరాటం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి పార్టీ. అయితే ఈ గాయం నుంచి బయటపడక ముందే... వైసిపి పార్టీకి మరో షాక్ ఇచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.

 

అయితే ఏపీ pac చైర్మన్ పదవిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో ఇవాళ నామినేషన్ వేసేందుకు ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లేసరికి... అసెంబ్లీలో ఉన్న అధికారులు ఎవరూ లేరట.  పిఎసి చైర్మన్ ఎన్నికకు సంబంధించిన వైసిపి పార్టీ వేసిన నామినేషన్.. తీసుకోలేదని వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 

దీనిపై తాజాగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు.  అసెంబ్లీ అధికారులపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎసి చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ దాఖలు కోసం... వైసిపి ఎమ్మెల్యేలు వస్తే... అసెంబ్లీ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. ప్రతిపక్ష నేతల నామినేషన్ అసలు తీసుకోరా...? ఇదేం రాజ్యాంగం అంటూ నిప్పులు చెరిగారు.


 అయితే వైసిపి నేతల పైన అధికారం తీర్చుకునేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.  ఒకవేళ పిఎసి పదవి ప్రతిపక్ష నాయకులకు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు నేతలు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో... గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన... అరికపూడి గాంధీకి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరో ఒకరిని  టిడిపిలో చేర్చుకొని పదవి ఇస్తారని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: