ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో అవినీతి కేసు నమోదైంది. మన దేశంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు అదానీ 2029 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఏపీ కూడా ఉంది.
 
కేవలం సీఎం జగన్ కు మాత్రమే అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఈ ఆరోపణల విషయంలో జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఏపీతో పాటు ఈ జాబితాలో తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, జమ్మూ కశ్మీర్ ఉన్నాయి. జగన్ నుంచి ఈ కామెంట్ల విషయంలో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
 
మరోవైపు ఈ వివాదాల వల్ల అదానీ షేర్లు ఢమాల్ అయ్యాయని ఆయన సంపద మాత్రం ఆవిరి అయిందని సమాచారం అందుతోంది. అదానీ గ్రూప్ మాత్రం వైరల్ అవుతున్న వార్తలు నిరాధారమని ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతుండటం గమనార్హం. జగన్ కు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవనే సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే జగన్ పార్టీ పరిస్థితి ఒకింత గందరగోళంగా ఉంది. ఈ వివాదాల వల్ల పార్టీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితులు కూడా లేవు. వైసీపీపై ఏవైనా విమర్శలు వచ్చినా స్పందించే వాళ్లు, రియాక్ట్ అయ్యే వాళ్లు లేకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ పార్టీ పుంజుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ తో ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. వైఎస్ జగన్ పార్టీ కోసం ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. వైఎస్ జగన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ షాకులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: