- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ ) . .

వారిద్దరు ఒకప్పుడు టిడిపి .. ఆ తర్వాత కాలగమనంలో ఇద్దరు పార్టీలు మారారు. ఇప్పుడు ఇద్దరూ బిజెపిలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో ఒకరు ఎంపీ అయితే .. మరొకరు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. పైగా ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు. అయితే సొంత జిల్లాలో ఒక నేత సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ... మరో నేత ఏకంగా ప్రాంతం మారి మరో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బిజెపి తరఫున ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆధిపత్య‌ రాజకీయాలు ఇప్పుడు జిల్లాతో పాటు ఏకంగా కూటమి ప్రభుత్వానికి సెగ పెడుతున్నాయి. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ? ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి .. మరొకరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేసిన భ‌గ్గుమ‌నే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సొంత నియోజకవర్గంలో వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ తానైవ్యవహరిస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం.


మద్యం నుంచి ఇసుక వరకు అన్ని విషయా లలోనూ ఆయన వర్ధం హ‌వా బాగా పెరిగిపోయింది. అక్క‌డ అదానీ సంస్థ ప‌వ‌ర్ ప్లాంట్‌ నిర్మిస్తోంది.. ఇది వైసీపీలో పురుడు పోసుకుంది వీటిలో సబ్ కాంట్రాక్ట్ ను సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్‌స్ట్ర‌క్షన్ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు రమేష్ దక్కించుకోవటం ఆది కుటుంబ సభ్యులు .. ఆయన అనుచర వర్గం బాగా వ్యతిరేకిస్తుంది. తాజాగా ఇక్కడ పనులు ప్రారంభించిన వారిని బెదిరించి దాడులకు దిగారు. గత రెండు నెలల నుంచి ఈ గొడవ నడుస్తోంది. ఈ క్రమంలోని ఇద్దరు నేతలను చంద్రబాబు హెచ్చరించారు .. ఆధిపత్య రాజకీయాల వద్దని హిత‌వు పలికారు. ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మరి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆది వర్గం రెచ్చిపోయి మరి దాడులకు దిగింది. ఇంత జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేతలు ఎవరు జోక్యం చేసుకోవడం లేదు .. పైగా ఇద్దరు బిజెపిలో ఉండడంతో సర్దుబాటు చేయకపోవడంతో గొడవ మరింత ముదిరేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP